telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కుండపోత.. వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌

rain hyderabad

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి క వరంగల్ జిల్లాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల నేపధ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు అలుగుబారుతున్నాయి. వాగులు, వంకలు పొంగతి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందన్‌పల్లి గ్రామ శివారులో చలివాగు పొంగి పొర్లి 10 మంది రైతులు తమ పొలాల్లో చిక్కుకుపోయారు. దీంతో హెలీకాప్టర్‌ ద్వారా వారిని రక్షించారు. మరో వైపు ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదుకాగా మరో మూడు రోజుల పాటు ఈ తుఫాన్‌ కొనసాగనున్నదని వాతావరణశాఖ హెచ్చరించింది.

Related posts