telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశంలో అరాచకత్వం పెరిగిపోతోంది: బాబా రాందేవ్

Ramdev baba

సీఏఏను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అరాచకత్వం పెరిగిపోతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఏఏపై భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని బాబా రాందేవ్ అన్నారు. మనమంతా భారతీయులమని, దేశం నుంచి ముస్లింలను వెళ్లగొడతారనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు.

ఢిల్లీలోని షహీన్ బాగ్ లో ఆందోళన చేస్తున్న నిరసనకారుల వద్దకు ఈరోజు తాను వెళ్తున్నానని ఆయన చెప్పారు. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వినేందుకు వెళ్తున్నానని తెలిపారు. నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు అని చెప్పారు. అయితే నిరసన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని అన్నారు. తాను ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని అన్నారు. హిందువులు, ముస్లింలు ఘర్షణకు దిగడాన్ని తాను కోరుకోనని చెప్పారు. హక్కుల కోసం జరిగే ఎలాంటి నిరసనలకైనా తాను మద్దతుగా ఉంటానని చెప్పారు.

Related posts