telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియా చక్రవర్తి అరెస్ట్… ఆ 25 మంది ఎవరు ?

Rhea

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసుపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతున్న క్రమంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకొస్తోంది. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి రియాను ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో తనకు డ్రగ్స్ అలవాటు ఉందని రియా ఒప్పుకుంది. సుశాంత్ మృతి నేపధ్యంలో డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియాని అరెస్టు చేశారు. అదే విధంగా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా టెస్ట్ తోపాటు మరికొన్ని టెస్టులు చేయనున్నారు వైద్యులు. ఇక విచారణలో రియా 25 మంది పేర్లు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈ 25 మంది బాలీవుడ్ కు సంబంధించినవారే అని తెలుస్తుంది. ఇక ఆ 25 మందికి కూడా నార్కోటిక్స్ పోలీసులు నోటీసులు పంపనున్నారని సమాచారం. ఇక ముందుముందు చాలా మంది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రియా సోదరుడు షోవిక్‌తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ ను కూడా ఎన్‌సీబీ అధికారులు గతంలో అరెస్ట్ చేసారు.

Related posts