telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్.ఆర్.ఆర్ రహస్యాల..రాజమౌళి..

rajamouli ideology changed with RRR

రాజమౌళి దేముడిని పెద్దగా నమ్మడనే చెప్పాలి, దానికితోడు జాతకాలు సంఖ్య శాస్త్రాల పై కూడ జక్కన్నకు పెద్ద గా నమ్మకాలు లేవు. అలాంటి రాజమౌళికి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో జరుగుతున్న పరిణామాలతో మూఢనమ్మకాలు ఏర్పడ్డాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి ఏదో ఒక సమస్య ఎదురౌతూనే ఉంది. ఈమూవీకి ఎంపిక అయిన బ్రిటీష్ బ్యూటీ డైసీ తప్పుకోవడం ఆతరువాత చరణ్ కు గాయం అవ్వడం ఆపై జూనియర్ చేయికి గాయం అయి షూటింగ్ షెడ్యూల్స్ అనేక మార్పులు రావడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కు దిష్టి తగిలిందా అన్న సందేహాలను కొందరు రాజమౌళి దగ్గర వ్యక్త పరిచినట్లు టాక్. మొదట్లో ఈవిషయాలను లైట్ గా తీసుకున్న రాజమౌళి వరసపెట్టి జరుగుతున్న పరిణామాలతో షాక్ అయి ఇప్పుడు తన పద్ధతి మార్చి ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఎక్కడ జరుగుతోందో ఎవరికీ చెప్పకుండా అతి రహస్యంగా షూటింగ్ జరుగుతూ ఉండటం రాజమౌళిని వెంటాడుతున్న దిష్టి భయాలే అని అంటున్నారు.

దీనికితోడు ఈ షూటింగ్ స్పాట్ కు వచ్చే నటీనటులతో పాటు తన యూనిట్ సభ్యుఅలను కూడ ఎవరినీ షూటింగ్ స్పాట్ వివరాలు చెప్పవద్దు అంటూ రాజమౌళి ఇచ్చిన గట్టి ఆదేశాలు వెనుక కారణం ఏమిటి అంటూ కూడ కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. మరికొందరైతే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రస్తుతం ఎక్కడా జరగడం లేదనీ జూనియర్ గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదనీ అందువల్లనే చరణ్ తన భార్యతో కలిసి ఆఫ్రికా అడవులకు వెళ్ళాడనీ షూటింగ్ జరగడం లేదు అని వార్తలు బయటకు రావడం ఇష్టం లేక రాజమౌళి ఇలా అజ్ఞాత ప్రదేశంలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ అని లీకులు ఇస్తున్నాడని అంటున్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో అంతుచిక్కని రహస్యాలు ఏవో ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts