telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవి, చరణ్‌ వీడియోపై వర్మ కామెంట్స్‌..

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్‌29న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’సాంగ్‌ విడుదల తేదిని ప్రకటిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో నువ్వు నన్ను డామినేట్ చేస్తావా అంటూ చిరు- చరణ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వీడియోపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నేను మెగా హర్ట్‌ అయ్యాను. చిరంజీవి, చరణ్ తగ్గు తగ్గను తగ్గేదేలే అని అల్లు అర్జున్ డైలాగ్స్ వాడుతుంటే.. చిరంజీవి, చరణ్.. బన్నీ న్యూ మెగా హీరో అని రుజువు చేసినట్లు ఉంది’ అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Related posts