*టాలీవుడ్ పెద్దలపై మరోసారి ఆర్జీవి తీవ్ర విమర్శలు..
*పెద్దమనిషి మరణానికి విలువ ఇవ్వరా?
టాలీవుడ్ దిగ్గజనటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులంతా కృష్ణంరాజుకు నివాళులు అర్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణం రాజు మృతికి నివాళిగా టాలీవుడ్‌లో షూటింగ్‌లు ఆపకపోవడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలీవుడ్ పెద్దలపై మరోసారి ఆర్జీవి తీవ్ర విమర్శలు చేశారు.
మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం అంటూ అగ్రనటులందరినీ ట్యాగ్ చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు
డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.” అంటూ సినీ పరిశ్రమపై ఫైర్ అయ్యారు.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, లాంటి గొప్ప చిత్రాలను అందించిన మహా నటుడు చనిపోతే షూటింగ్ ఆపకపోవడం సిగ్గు సిగ్గు.. తెలుగు సినీ పరిశ్రమకి జోహార్లు అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.
కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహనబాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్, కల్యాణ్ కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు.
ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. ఇప్పుడీ ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి.
\
రణబీర్ కపూర్ పై కంగనా వ్యాఖ్యలు… స్పందించిన అలియా భట్