telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశంలో ప్రధాని మోదీ ఫాసిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు..

*దేశంలో ప్రధాని మోదీ ఫాసిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు
*కేంద్రం తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేసింది..
*ఆనాడు తాను సీఎంగా ఎన్నుకోబడ్డాను..
*అధికారికంగా బంద్‌కు ఎలా పిలుపునిస్తారని విమర్శించారు
*కేంద్ర తొలి భేటీలోనే ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారు
*దేశ సంపదను వారి సొంత ఆస్తిలా కేంద్ర అమ్ముతుంది..
*భ‌ర‌త‌మాత గుండెకు గాయ‌మ‌వుతోంది..
*హిట్ల‌ర్ లాంటి వారే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు
*తెలంగాణ‌లో మూడు తోక‌లు లేవు..
*మ‌మ్మ‌ల్ని కూల‌గొడ‌తామ‌ని అంటున్నారు.

దేశంలో మోదీని విమర్శిస్తున్న తొలి ముఖ్యమంత్రి తానే అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆయన ఫాసిస్ట్ లాగా వ్యవహరించారని, తెలంగాణ పట్ల కర్కశంగా ప్రవర్తించారని అన్నారు.

కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.మోదీ ప్రధాని అయ్యాక తొలి కేబినెట్ లోనే తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపారని అన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో  అనేక అంశాల్లో తెలంగాణకు జ‌రిగింది.

పొలాలకు శ్రీకాకుళంలో మీటర్లు పెడితే రైతులు సెంటర్లలో కుప్ప వేసి కాల్చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ కొన్ని జిల్లాల్లో పొలాల్లో మీటర్లు పెడితే కరెంటు ఆఫీసుల ఎదుట తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇది సంస్కరణ కాదు, అందమైన అబద్ధం. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వొద్దని విద్యుత్ చట్టంలో ఉంది. తెలంగాణ ఆర్టీసీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖలు వస్తున్నాయి. వాళ్లు ప్రభుత్వ సంస్థలు అమ్మినట్లు మనల్ని కూడా అమ్ముకోమంటున్నారు అని కేసీఆర్ విమర్శించారు.

జాతీయ జెండానే మార్చేస్తామ‌ని అంటున్నారు… ఎక్క‌డ‌నుంచి పుట్టుకొచ్చారు ఈ ద‌రిద్రులు..మ‌హాత్ముడు పుట్టిన నేల‌మీద మ‌రుగుజ్జులు మాట్లాడిన మాట‌లు అంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

Related posts