వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటివారో అందరికీ తెలిసిందే. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే. తాను ఎవరి గురించి చెబుతున్నాడో.. క్లియర్‌గా చెబుతూనే టార్గెట్ చేస్తుంటారు. ఆయన మాట్లాడే మాటల్లో ఒక్కోసారి ఎంతో అర్థం దాగి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. చేసింది తానే అని తనకు, అందరికీ తెలిసినా కూడా తాను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తారు. బుకాయిస్తుంటారు కూడా. ఈ మధ్య వర్మ ఎక్కువగా కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తోన్నట్టు కనిపిస్తోంది.
![]()
అషూ రెడ్డిని వింత యాంగిల్‌లో ఫోటో తీసేందుకు ప్రయత్నించిన వర్మ.. ఆ తరువాత ఇనయ సుల్తానా, జ్యోతిలతో వేసిన చిందులు మామూలుగా వైరల్ అవ్వలేదు. ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేశారనే టాక్ వచ్చింది. అరియానా ఆర్జీవీ చిట్ చాట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో విచ్చలవిడిగా ఆర్జీవీ మాట్లాడిన మాటలు, అరియానా శరీరా భాగాలమీద చేసిన కామెంట్లు ఎంతగా అందరినీ ఆశ్చర్యపరిచాయో చూశాం. అయితే ఆ సమయంలో అరియానా, ఆర్జీవీ పేర్లు నెట్టింట్లో మార్మోగిపోయాయి.

తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే దారుణమైన వీడియో బయటకు వచ్చింది. .టేబుల్ మీద అషూ రెడ్డి కూర్చుని ఉంటే.. కిందకు వంగి మరీ వర్మ వెరైటీ యాంగిల్ పెట్టి ఫోటో తీశారు. ఆ వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా వర్మ.. అషూ రెడ్డి ఫోటోను షేర్ చేస్తూ.. ఈమేనా? అషూ రెడ్డి.. ఆమెను ఇలా ఫోటో తీసింది ఎవరో మీకు తెలిస్తే నాకు చెప్పండి అని వర్మ తన తెలివిని ప్రదర్శించారు.

తాజాగా సెప్టంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో అషూ కాఫీ షాపులో కూర్చుని ఫోన్‌లో బిజీగా ఉండగా వర్మ ఆమె దగ్గరకు వెళ్లి నేను రామ్ గోపాల్ వర్మను అని ఆయన పరిచయం చేసుకున్న కూడా.. అషు రెడ్డి ‘సో.. వాట్’ అంటూ గంభీరమైన సమాధానం ఇచ్చింది. ఆ తరువాత రాము ఆమె కాళ్ల వైపు చూస్తూ నీ థైస్ బాగున్నాయ్ అని వర్మ బోల్డ్ కామెంట్స్ చేశారు . దీంతో ఆవేశం ఉప్పొంగుకొచ్చిన అషూ వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించింది. ఇంతటితో ప్రోమో పూర్తైంది. మరి వర్మ ఈ చెంపదెబ్బపై ఎలా రియాక్ట్ అయ్యాడనేది తెలియాలంటే సెప్టెంబర్ 7న రిలీజయ్యే పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే!..

అయితే వ ర్మ లాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే లేడీ యాంకర్లు కూడా యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా మారుతుంటారు.


ఆ సినిమా అంటే చంద్రబాబుకు భయం: లక్ష్మీపార్వతి