యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ ట్రీట్‌కు బాలీవుడ్ హీరోయిన్ కరీనా ఫిదా అయిపోయింది. థ్యాంక్స్ అంటూ ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేసింది ఈ బ్యూటీ. దీంతో మరోసారి ప్రభాస్ ట్రీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కడుపు నిండా తానూ తినటమే కాదు.. ఇతరుల కడుపులు పగిలేలా భోజనాలు పెట్టడం ప్రభాస్ తన కృష్ణం రాజు గారి నుండి వచ్చిన ఆనవాయితీ. ఇండస్ట్రీలో ఆతిధ్యం అంటే కృష్ణం రాజుదే.. ఆయన పెట్టె భోజనం వెరైటీలు మరెవ్వరు పెట్టరని అంటుంటారు. అందుకే తానూ పనిచేసే మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ తన కో యాక్టర్స్‌కి ఫుడ్ పార్టీ ఇస్తుంటాడు. ఇటీవల సాహో హీరోయిన్ శ్రద్ధ కపూర్, రాధే శ్యామ్ ఫేమ్ బాగ్యశ్రీ, సలార్ హీరోయిన్ శృతి హాసన్ కి రుచికరమైన రాజుగారి వంటకాలని వడ్డించిన ప్రభాస్.. తాజాగా బాలీవుడ్ బెబోకి కూడా భారీ పార్సల్స్ పంపాడు.
తాజాగా ప్రభాస్ పాన్ ఇండియా ఆదిపురుష్ సినిమాలో రావణ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు ఈ పాన్ ఇండియా స్టార్ బిర్యానీ పంపించాడు. దీనికి సంబంధించిన ఫొటోను బాలీవుడ్ బ్యూటీ, సైఫ్ భార్య కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోర్‌లో షేర్ చేసింది. బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది కచ్చితంగా బెస్ట్ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు అని బ్యూటీ కరీనా ఫిదా అయిపోయింది. దీంతో ప్రభాస్ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ తినిటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ రిలీజ్‌కు మరో ఏడాది మిగిలి ఉండగానే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.