telugu navyamedia
తెలంగాణ వార్తలు

చార్జీల పెంపు మీ అసమర్థ పాలనకు నిదర్శనమా..

తెలంగాణ స‌ర్కార్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు తీవ్ర కసరత్తు చేస్తుంద‌ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.విద్యుత్‌ చార్జీల పెంపు టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు నిదర్శనమా అని , దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి తక్కువ ధరలకు విద్యుత్ లభిస్తున్న తరుణంలో చార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపుతారా అని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిపడ్డారు.

క‌రోనా స‌మ‌యంలో పూట‌గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింద‌ని , ఈ త‌రుణంలో ఛార్జీలు పెంచ‌డం దారుణ‌మ‌ని అన్నారు.పెట్రో ఉత్పత్తులపై వేసే పన్ను వ‌ల్ల ఆర్టీసీ పాలిట శాపం అయింద‌ని , ఈ విషయం వాస్తవం కాదా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇది మీ పతనమైన పాలనా వ్యవస్థల దుష్పలితామా అని నిలదీశారు.

ఇంకో వైపు కొత్త‌గా చైర్మ‌న్ అయిన బాజిరెడ్డి సీఎం పేరు చెప్పి ప్రైవేట్ ప‌రం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. పాల‌ను గాలిగి వ‌దిలేసి..ప్ర‌జ‌ల‌కు మాయం చేబుతున్నార‌ని అన్నారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెప్ప‌డానికి సిద్దంగా ఉన్నార‌ని అన్నారు. ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపు, ఆర్టీసీ నష్టాలపై గురువారం ట్వీట్ చేశారు.

Related posts