telugu navyamedia
తెలంగాణ వార్తలు

మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే .. ఆ శ‌క్తుల చిల్ల‌ర ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టికీ నెర‌వేర‌వు

*స్వ‌తంత్ర పోరాటంలో ఎంద‌రో చేసిన త్యాగాలు..ఈనాటి త‌రాలకు తెలియ‌దు
*జాతీయ జెండా ను ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్‌
*1987 సిపాయిల తిరుగుబాటు కీల‌కం
*సిపాయిల తిరుగుబాటు త‌రువాత బ్రిటిష్ ప్ర‌భుత్వం ఇంకా అణిచివేసింది.
*మ‌హాత్ముడు ఎప్ప‌టికైనా మ‌హాత్ముడే..
*ఇటీవ‌ల మ‌హాత్ముడ్ని కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు వింటున్నాం..
*ఆ శ‌క్తుల చిల్ల‌ర ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టికీ నెర‌వేర‌వు

దేశంలో మహాత్మా గాంధీ ని అవమానించే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మహాత్మాగాంధీ ప్రపంచంలోని ఎంతో మందికి స్పూర్తి ..అలాంటి మహోన్నతుడిని కించపరిచే సంఘటనలు ఇవాళ దేశంలో వినాల్సి వస్తుందన్నారు.

భారతమాతకు సమానంగా గౌరవం ఇవ్వాల్సిన కొందరు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు..మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే .. ఆ చిల్లర శక్తుల ప్రయత్నాలు ఫలించవని అన్నారు..

స్వాతంత్ర్య పోరాటం గురించి ఈనాటి తరానికి తెలియదని అన్నారు. ఎంద‌రో మ‌హాబావుల త్యాగాలు, పోరాటాలతో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. అలాంటి గడ్డపై జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందామని అన్నారు. అవసరమైతే దేశం కోసం ముందుండి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

పేదరికం ఉన్నంత కాలం అలజడులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త తరాలకు స్వాతంత్ర్య పోరాటాలు గురించి తెలియాల‌ని కేసీఆర్ అన్నారు.

దేశంలో అలజడులను సృష్టించిన బ్లాక్‌ షిప్‌లను తరిమి కొట్టే ఘనత భారత దేశానికి ఉంది. ఈ గడ్డపై జాతిని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వెకిలి, మకిలి చర్యలను ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. 

కొన్ని నెగెటివ్ ఫోర్క్స్‌లను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. చెలరేగుతున్న కూర్పును చెద‌ర‌గొట్టడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతిని చీల్చే వారిపట్ల అప్రమత్తమై ఉండాలని తెలిపారు. అవసరమైతే దేశం కోసం ముందుండి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు

ప్రజాప్రతినిధులంతా స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. మహనీయుల కష్టం, త్యాగాలతో దేశం ఈ తీరుకు వచ్చింది. కాబట్టే, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు

Related posts