telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

గచ్చిబౌలి హాస్టల్‌లో లేడీ టెక్కీ ఆత్మహత్య

Engineering college Fees student sulcide

హైదరాబాద్ నగరంలోని గౌచ్చిబౌలిలోని లేడీస్ హాస్టల్‌లో ఓ సాఫ్ట్‌వేర్ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొగాకు హరిణి(24) అనే యువతి గచ్చిబౌలిలోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటూ మాదాపూర్‌లోని గోల్డెన్‌హిల్స్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తోంది. రెండున్న సంవత్సరాలుగా ఆ సంస్థలోనే హరిణి పని చేస్తోంది.

అయితే బుధవారం ఆఫీసుకు వెళ్లని హరిణి.. హాస్టల్‌లో తన గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలుసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉద్యోగం కోల్పోతాననే మనస్థాపంతోనే హరిణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె పనిచేస్తున్న సంస్థ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నెలతో ఆమె జాబ్ గడువు ముగియనున్నట్లు పోలీసులు చెప్పారు.

Related posts