telugu navyamedia
తెలంగాణ వార్తలు

రెడ్‌ అలర్ట్‌..తెలంగాణ‌లో మరో మూడురోజులు భారీ వర్షాలు..

తెలంగాణ‌  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

గత మూడు రోజులుగా ఏడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి .. మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలోని సముద్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది.

ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది.

ఈ మేరకు ఆదిలాబాద్, కొము­రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.

ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయన్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts