telugu navyamedia
తెలంగాణ వార్తలు

ధాన్యం సేకరణపై రాహుల్‌ ట్వీట్‌..ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్

*రైతు వ్య‌తిరేక విదానాలు మానుకోవాలి..-రాహుల్‌

*తెలంగాణలోధాన్యం సేకరణపై రాహుల్‌ ట్వీట్‌..

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుకు సిద్దమవుతుంది. 

ఈమేరకు ధాన్యం కొనుగోలు అంశంపై మంగళవారం తెలుగులో ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో  రై తుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. .

రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, వారు పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు.. తెలంగాణలో ధాన్యం పూర్తిగా కొనేవరకు రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది.

ధాన్యం ‌కొనుగోలుపై రాహుల్ ట్వీట్‌కు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్‌లో సంఘీభావం తెల‌ప‌డం కాదు..మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.

Related posts