telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ నేతలు బయటకు రావడం లేదు: కేటీఆర్‌

KTR Counter pawan comments

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో కాంగ్రెస్‌ నేతలెవరూ బయటకు రావడం లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులెవరూ పోటీ చేసే అవకాశం లేదని చెప్పారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వహించిన హుజూర్‌నగర్‌, చొప్పదండి నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ, పార్టీ సహకారంతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల కలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్‌ 3400 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గుర్తు చేశారు. తండాలు, గూడేల్లో సర్పంచ్‌ల ఎన్నికల ఏకగ్రీవమయ్యేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తుందని తెలిపారు. ‘ఓటమి ఎరుగని నేతలం’ అని పోజు కొట్టిన రాజకీయ దురంధరులను సమష్టిగా పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించామని చెప్పారు.

Related posts