రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాలీజ్ ఖాన్ దర్గా సమీపంలోని ఓఆర్ఆర్‌పై లారీ దగ్ధమైంది. ఆదివారం గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు ఏషియన్ పెయింట్ డబ్బాల లోడుతో వెళ్తున్న లారీని అతి వేగంగా వెనకనుంచి వచ్చిన కారు ఢీకొన్నది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల థాటికి లారీ పూర్తిగా దగ్ధమైంది.
కారులో ఉన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది ఆస్పత్రికి తరలించడం జరిగింది. లారీలో ఉన్న పెయింట్ డబ్బాలను వెలికి తీసేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన పూజా…