telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సోనూ సూద్ కు మరో అరుదైన గౌరవం…

Sonusood

రీల్‌లో విలన్‌గా చేసే సోనూ నిజ జీవితంలో ప్రజల పాలిట హీరోగా మారాడు. కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులను తమతమ ఇళ్లకు చేర్చడంలో సోనూ ప్రధాన పాత్ర పోషించాడు. దేశ సేవ మన కర్తవ్యం అని అది ఎవరో చెప్తే చేసేది కాదని తన ఉద్దేశ్యంగా చెప్పిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడి వారైనా సమస్యలతో పోరాడుతుంటే వారికి సోనూ తన వంతు సహాయం అందించి అండగా నిలిచాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా ఎవ్వరికీ చెప్పుకోలేదు. అతని ఉదారత గురించి లోకం కోడై కూసింది. ఇంత చేసినా ఏ ప్రభుత్వం కూడా అతడికి ఎటువంటి సత్కారాలు చేయలేదు. కానీ సోనూకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ప్రపంచంలోని టాప్ 50 ఆసియా తారల సరసన సోనూ కూడా ఉన్నాడు. అయితే ఇప్పడు సోనూ మరో అరుదైన అవార్డును అందుకున్నాడు. ఇది ఇచ్చింది ఓదో పెద్ద సంస్థ కాదు. ముంబైకు చెందిన ఓ కార్పెంటర్ అవును ఇంద్రోజిర రమెష్ అనే వ్యక్తి ముంబై మహానగరంలో ఓ కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతడు తన జీవితాన్ని కష్టాలతోనే గడిపాడు. చివరకు చెక్క పనిలో స్థిరపడ్డాడు. తనకు కూడా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించాలని ఉన్నా తన ఆర్థిక పరిస్థితి సహకరించదు. అందుకే దేశంలో ఎవరైన ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారి ప్రతిమను తయారు చేసి వారికి అందిస్తాడు. దానికి అతడు పద్మ సేవ అనే పేరును పెట్టుకున్నాడు. ఈ అవార్డును అతి తక్కువ మంది అందుకున్నాడు. ఇంతకు ముందు నేను సైతం అంటూ ఎందరికో అండగా నిలిచిన మంచు లక్ష్మీ, దాదాపు 220 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్, తాను బిచ్చమెత్తగా వచ్చిన రూ.3లక్షలను సమాజసేవలో ఖర్చు చేసిన కామరాజులు ఈ బిరుదును అందుకున్నారు. అయితే ఇప్పుడు సోనూ సూద్‌ను ఈ అవార్డుతో రమేష్ సత్కరించాడు.

Related posts