ఎప్పటి నుండో సొంత బ్యాంకు వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కల నెరవేరింది. రాష్ట్రంలో సొంత బ్యాంకును ఏర్పాటు కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత కేరళ బ్యాంకును ఏర్పాటు చేయడానికి 13 డిసిబిలను, కేరళ రాష్ట్ర సహకార బ్యాంకులో విలీనం చేయనున్నామని, దీంతో ఈ బ్యాంక్ రాష్ట్రంలో అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే ఈ బ్యాంక్ ఏర్పాటు లక్ష్యమని పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.
బ్యాంకుల (డిసిబి)లను విలీనం చేసి కేరళ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఆర్‌బిఐ తుది ఆమోదం కొన్ని షరతులను విధించిందని, అలాగే ఈ అంశానికి సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కొన్ని కేసుల్లో తుది తీర్పులకు అనుగుణంగా త్వరలో కొత్త బ్యాంకును ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కొత్త బ్యాంక్ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు విజయన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.


ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు: జగన్