telugu navyamedia
రాజకీయ వార్తలు

భారీగా రైల్వే ప్రైవేటీకరణ .. నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వమా.. !

huge privatization in indian railways

భారత ప్రభుత్వం రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే 150రైళ్లను, 50రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో పడింది. ఈ మేర నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లెటర్ ద్వారా తన అభిప్రాయాన్ని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్‌కు తెలియజేశారు. 400రైల్వే స్టేషన్ల డెవలప్‌మెంట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రైల్వే మంత్రితో విస్తారంగా చర్చించాం. కనీసం 50 రైల్వే స్టేషన్లు అయినా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నామని అమితాబ్ కాంత్ అన్నారు.

ఇటీవల జరిగిన అనుభవాన్ని బట్టి ఆరు ఎయిర్‌పోర్టులను ప్రైవేటికరణ ద్వారా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగానే తొలి దశలో 150 రైళ్లను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నామని అమితాబ్ కాంత్ తెలిపారు. 4న మొదలైన లక్నో-ఢిల్లీ మార్గం గుండా వెళ్లే తేజాస్ ఎక్స్‌ప్రెస్ తొలి రైల్వేయేతర రైలు. ఐఆర్సీటీసీ కొత్త బెనిఫిట్స్‌ను ప్రయాణికుల కోసం అమలులోనికి తీసుకువస్తుంది. కాంబినేషన్ మీల్స్, రూ.25 లక్షల వరకూ ఉచిత ఇన్సూరెన్స్, రైలు ఆలస్యంగా వస్తే దానికి డబ్బులు ఇలా కొత్త పథకాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుంది.

Related posts