భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి.
దీంతో తుమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు.
తుమ్మిడి కుంట చెరువు ఎఫ్ టీఓల్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుంది.
పక్కా ఆధారాలతో ఈరోజు (శనివారం) తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత కొనసాగిస్తున్నారు.
అయితే, మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసి వేశారు.
ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు తెలియ చేసారు.
కవిత, కేటీఆర్‌తో కల్వకుంట్ల రాజ్యం విస్తరించాలని కేసీఆర్ ప్రయత్నం: వివేక్