telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రకుల్ చేతిలో మందు బాటిళ్లు… ఆమె రియాక్షన్ ఇదీ…!

Rakul

గత రెండుమూడు రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చేతిలో ఓ రెండు బాటిల్స్ పట్టుకొని రోడ్డు దాటుతూ కనిపిస్తోంది రకుల్. దీంతో ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ”రకుల్ ప్రీత్ సింగ్ మద్యం కొనుగోలు చేసింది.. కావాలంటే ఆమె చేతిలో ఉన్న మద్యం బాటిళ్లు చూడండి” అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించింది రకుల్. అదే వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ జబర్దస్త్ కౌంటర్ వేసింది. ”వావ్!!మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయా? ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయం నాకు తెలియదే” అంటూ తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఘాటుగా రిప్లై ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలో వైన్ షాపులు కూడా తెరుచుకోవడంతో రకుల్ మద్యం కొనుగోలు చేయడం నిజమే అని ఫిక్సయ్యారంతా. కానీ ముంబైలోని బాంద్రాలో ఓ మెడికల్ షాప్ వద్ద రకుల్ ప్రీత్ సింగ్ మందులు కొనుగోలు చేసుకుని రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి ఈ వీడియో తీశారు.

Related posts