విజయవంతం అయిన చిత్రాల కొనసాగింపుగా వస్తున్న చిత్రాల వరుస ఇటీవల పెరిగిపోతుంది. అయితే అందులో చాలా కొద్దీ సినిమాలు మాత్రమే విజయవంతం అయ్యాయి. ఆ కోవలోనే.. రాజుగారి గది, రాజుగారి గది2 సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఓంకార్ ఇప్పుడు అదే సిరీస్‌లో మూడు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రాజుగారి గది3 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తరువాత అవికా గోర్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్, అజయ్ ఘోష్, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్ర యూనిట్ తాజాగా సీనియర్ హీరో విక్టరి వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. షబీర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డ్రోన్ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు భయం: ఎమ్మెల్యే రోజా