telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిజమైన హీరో రజనీకాంత్

తెర మీదనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ .

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు దేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖమంత్రి నారా చంద్ర బాబు నాయుడును రాజకీయంగా దెబ్బతీయడానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి జైల్లో పెట్టింది . దీనిపై చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వల్ల ఆర్ధికంగా లాభపడ్డ వారు, రాజకీయంగా ఎదిగినవారు తెలుగు సినిమా రంగంలో చాలా మంది వున్నారు . కానీ , చంద్ర బాబుపై అక్రమ కేసు బనాయించారని అటు ప్రధాన మీడియా ,ఇటు సోషల్ మీడియా , జాతీయ మీడియా సైతం ప్రభుత్వాన్ని , సి .ఐ .డి ని , వెనుకనుండి నడిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నాయి .

అయినా మన సినిమా హీరోలు చంద్ర బాబు నాయుడు అరెస్ట్ నిరసన వ్యక్తం చెయ్యలేదు. ట్విట్టర్ లో తెలుగు దేశం వారికి ధైర్యం చెప్పలేదు . చంద్ర బాబు నాయుడు కుమారుడు లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడలేదు
ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేశ్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారన్న వార్త తెలుగు దేశం శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తుంది .

చంద్ర బాబు నాయుడు పోరాట యోధుడు , ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన పధకాలు ,చేసిన అభివృద్ధి ఆయనకు రక్షగా నిలుస్తాయి ‘ అని రజనీకాంత్ లోకేశ్ చెప్పి ధైర్యంగా ఉండమన్నారు .
రజనీకాంత్ తెర మీదనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు . ఒక సినిమా హీరోకు సామాజిక భాద్యత కూడా ఉంటుందని రజనీకాంత్ నిరూపించారు .

మన హీరోలు తెరమీద మాత్రమే తమ ప్రతాపం చూపిస్తారు . నిజ జీవితంలో మాత్రం జీరోలే .

Related posts