telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేపు మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌…

ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ పార్టీలు అని దీని పైనే దృష్టి పెట్టాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు సగం పూర్తి అయ్యాయి. అంటే రెండు విడతల ఎన్నికలు పూర్తి కాగా మూడో విడత ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. రేపటి ఏపీ పంచాయతీ మూడోదశ పోలింగ్‌కు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలిస్తున్నారు. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నిన్నటితో ప్రచార పర్వం ముగియడంతో… అభ్యర్థులు గెలుపు కోసం తెరచాటు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా చూస్తే మూడోవిడతలో 3 వేల 221 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. మూడోవిడత లో 579 పంచాయతీలు 11 వేల 732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలు మినహాయించి మిగిలిన 2 వేల 642 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు బరిలో 7 వేల 756 మంది పోటీపడుతున్నారు.

Related posts