telugu navyamedia
సినిమా వార్తలు

“రాజ్ దూత్” ప్రీ లుక్ అదిరిందిగా…

Rajdoot Telugu Movie Pre Look

శ్రీహరి తనయుడు మేఘాంశ్ పరిచయం అవుతున్న సినిమా ‘రాజ్‌దూత్’. శ్రీహరి నటించిన ‘భైరవ’ చిత్రంలో మేఘాంశ్ బాలనటుడిగా కనిపించారు. చదువు పూర్తి కావడంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ప్రీ లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రీలుక్‌లో చేతిలో హెల్మెట్ పట్టుకుని ఎదురుగా ఉన్న ‘రాజ్‌దూత్’ బైక్‌ను చూస్తున్న మేఘాంశ్ బ్యాక్‌లుక్‌లో అదరగొడుతున్నారు. కాగా ఈ ‘రాజ్‌దూత్’ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ నిర్మిస్తున్నారు. కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

Related posts