telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రజినీ సంచలన ట్వీట్.. కొత్త ఏడాది పార్టీ లాంచ్

Rajinikanth actor

సూపర్ స్టార్ రజనీ కాంత్ సంచలన ప్రకటన చేసారు. తాను రాజకీయాలోకి వస్తున్నా అని.. త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నా అని ప్రకటించారు. నేడు ఆయన ట్విట్టర్ లో కొత్త పార్టీ విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. 2021 ఎన్నికల్లో తాను పోటీ చేస్తా అని తన పార్టీ జనవరి నుంచి మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 31 న పార్టీ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని రజనీ కాంత్ పేర్కొన్నారు. పార్టీ గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఆయన డిఎంకె లో లేదా జాతీయ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యలు కూడా వినిపించాయి. బిజెపి అగ్ర నేతలతో ఆయన సమావేశం కూడా అయ్యారు. ఇక 2021 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తా అని ప్రకటించడంతో కమల్ హాసన్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. 

Related posts