telugu navyamedia
సినిమా వార్తలు

డ్రగ్స్ ఎలా ఉంటాయో తెలియ‌దు, ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లాను

హైదరాబాద్ బంజారాహిల్స్ లోనిరాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ బయటపడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు . 

ఈ డ్ర‌గ్స్‌ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 142 మంది లిస్ట్‌ను పోలీసులు విడుదల చేశారు. పార్టీకి హాజరైన వారిలో బిగ్ సెలబ్రిటీలు, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పార్టీకి వెళ్లిన వాళ్లలో ఒకరు.

తను అసలు డ్రగ్స్‌ తీసుకోలేదని, తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని ప్ర‌ముఖ రాహుల్ సిప్లిగంజ్ ఓ మీడియా ఛానెల్ కు రేవ్ పార్టీ విషయంపై స్పందించారు.

 ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లానని.. మా టేబుల్ దగ్గర మేం ఫన్ చేసుకుంటూ ఉన్నామని , రాత్రి 1:30 సమయంలో పబ్ నుంచి వెళ్లిపోయే టైమ్ లో పోలీసులు ఆపారని.. ఎందుకని ప్రశ్నిస్తే సమాధానమివ్వలేదని.. ఆ తరువాత 150, 200 మందిని స్టేషన్ కి తీసుకెళ్లారని రాహుల్ చెప్పారు. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కానీ అడ్డంగా దొరికానని తనపై వార్తలు రాస్తున్నారని వాపోయారు.

పబ్‌లో దొరికిన మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ విచారణకు అయినా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

 

Related posts