ఉత్తర ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేర్ పర్యటనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, మరో ముగ్గురిని అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీ నుంచి బయలు దేరింది. రాహుల్‌తో పాటు విమానంలో చత్తీస్ఘడ్ సీఎం బగేల్, పంజాబ్ సీఎం చన్నీ ఉన్నారు. ఎట్టి పరి స్థితుల్లో కూడా రైతుల కుటుంబాలను పరామర్శిస్తానని అంటున్నారు రాహుల్. చివరిక్షణంలో రాహుల్‌గాంధీ లఖీంపూర్ పర్యటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కాగా అంతకు ముందు..లఖింపుర్ వెళ్లేందుకు రాహుల్ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లఖింపూర్‌లో 144 సెక్షన్ అమల్లో ఉందని .. నవంబర్ 8వరకు ఇది అమల్లో ఉంటుంది. అక్కడికి ఎవరిని అనుమతించడం లేదని అధికారిక ప్రకటనలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా-బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపథ్యంలో రాహుల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమైంది. చివరిక్షణంలో రాహుల్‌తో పాటు ప్రియాంకకు కూడా అనుమతి ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది.

