telugu navyamedia
సినిమా వార్తలు

అరటిపండ్లు ఆరోగ్యానికి హానికరం అంటున్న హీరో… ఎందుకంటే…!!?

Rahul-Bose

సాధారంగా మనం అరటి పండ్లను డజన్ల లెక్కలోనే కొంటుంటాము. అయితే అరటిపండ్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉండొచ్చు. కొన్ని రకాల అరటి పండ్లకు మాత్రం కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ బాలీవుడ్ హీరో ఇప్పుడు అరటిపండ్లు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. ఎందుకంటే ఆయన తీసుకున్న రెండు అరటి పండ్ల రేటు ఆయనతో ఇలా చెప్పేస్తోంది. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌ షూటింగ్ నిమిత్తం చండీగఢ్ వెళ్లిన రాహుల్ అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశాడు. జిమ్‌కు వెళ్లొచ్చి రెండు అరటి పండ్లకు ఆర్డర్ ఇచ్చాడు. పండ్లతోపాటు వచ్చిన బిల్లు చూసి నోరెళ్లబెట్టాడు. వాటిపై ఏకంగా రూ.442.50 బిల్లుండడంతో హీరోగారి మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే కాసేపటి తర్వాత బిల్లు సంగతి ఏంటా అని పరిశీలించి చూడగా, సెంట్రల్ జీఎస్టీ కింద రూ.33.75, యూటీ జీఎస్టీ కింద మరో రూ.33.75 వేసి మొత్తం బిల్లును రూ.442.50గా చూపించారు. దాంతో తాను రెండు అరటిపండ్లు తిన్నానని వాటి రేటు దిమ్మతిరిగేలా ఉందని, అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనని ట్వీట్ చేశాడు రాహుల్ బోస్‌. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది.

Related posts