telugu navyamedia
తెలంగాణ వార్తలు

గాల్లో కాల్పులు జ‌ర‌ప‌డానికి ఎవ‌రు అనుమ‌తిచ్చారు..

*గాల్లో కాల్పులు జ‌ర‌ప‌డానికి ఎవ‌రు అనుమ‌తిచ్చారు..
*ప్రైవేట్‌ వ్యక్తికి వెపన్‌ ఇవ్వమని ఏ చట్టం చెబుతుందో పోలీసులు చెప్పాలి
*మంత్రిని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి
*ఘ‌ట‌న‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి..

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నిన్న మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ ‎గౌడ్‌ ఏ చట్ట ప్రకారం గాల్లో కాల్పులు జరిపారో చెప్పాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు . ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా ప్రైవేట్‌ వ్యక్తికి వెపన్‌ ఇవ్వమని ఏ చట్టం చెబుతుందో పోలీసులు చెప్పాల‌ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డిమాండ్ చేశారు.

ఆదివారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఇండియన్ ఆర్మ్మ్ యాక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను  శ్రీనివాస్ గౌడ్ పై కేసు  నమోదు చేయాలని  రావురఘునందన్‌ రావు డిమాండ్ చేశారు .

ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీనివాస్‌ గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. .

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరిపే సమయంలో పొరపాటున మిస్ ఫైర్ అయితే అక్కడే ఉన్న ప్రజలపైకో లేదా ఎస్పీ, కలెక్టర్లతో పాటు అధికారులపైకి బుల్లెట్లు దూసుకు వస్తే ఏం చేసేవారని ఆయన ప్రశ్నించారు. ఫైరింగ్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఏమైనా అనుభవం ఉందా అని ప్రశ్నించారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్​కు ఏమైనా లైసెన్స్‌ ఉందా అని రఘునందన్‌రావు అడిగారు.ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్‌రావు కోరారు.

ఎస్పీ సమక్షంలో మంత్రి ఆయుధంతో గాల్లోకి కాల్పులు జరిపితే ఇంతవరకు ఎందకు తుపాకీని సీజ్ చేయలేదో చెప్పాలన్నారు.  ఈ తుపాకీలో ఉన్నవి రబ్బరు బుల్లెట్లా ఒరిజినల్ బుల్లెట్లా అనేది నిర్ధారించేందుకు క్యాడ్రిట్జ్ లు సీజ్ చేయలేదని రఘునందన్ రావు చెప్పారు. మంత్రి కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేదన్నారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలన్నారు. 

Related posts