నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని చెప్పారు. క్రిస్టియన్ దళితులతో తనపై దాడి చేయించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. హిందువులు మేల్కొని దాడిని ప్రతిఘటించాలని చెప్పారు.
తనకు కరోనా వైరస్ అంటించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఆటవిక పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర పోలీసులకు చట్టంపై అవగాహన లేదని అన్నారు. తాను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని చెప్పారు. దళిత క్రిస్టియన్లు హిందువుల ముసుగులో రిజర్వేషన్లు కొట్టేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాను పలు సార్లు ప్రస్తావించానన్నారు.