telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పంజాబ్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళన

punjob farmers

పార్లమెంట్‌లో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ లో మూడో రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కిసాన్ మంజ్దూర్ సంఘర్ష్ కమిటీ అమృత్‌సర్‌లో రెండు రోజులుగా రైల్‌రోకో నిర్వహిస్తోంది. ఈ నెల 24న ప్రారంభమైన ర్యాలీ ఈ రాత్రి దాకా జరగనుంది.

రైతులు, కిసాన్ మంజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ బిల్లుల వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రయోజనాలకు ఈ బిల్లులు పూర్తి విరుద్ధమని అన్నారు. వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts