telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. వాహనయోగం.. కీలక నిర్ణయాలు..

today rasi falalu

మేషం : కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృషభం : సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం : కొత్త పనులు చేపడతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం : పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం : చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య : పనులలో పురోగతి. సోదరుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల : రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు : శుభకార్యాలకు హాజరవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం : ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం : శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులు వాయిదా. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం : సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విచిత్ర సంఘటనలు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

Related posts