telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీసీఎం జగన్ ప్రసంగం..లంచం లేని పాలనే ప్రధాన అంశం…

jagan as cm first decisions to deliver

జగన్ ప్రమాణ స్వీకారం పూర్తిఅయింది. ప్రమాణస్వీకారం అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం ప్రజలకు చెప్పినట్టుగా నేడే కొన్ని ప్రధాన ప్రకటనలు చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే అధికారికంగా ఇప్పటివరకు ఈ ప్రకటనల గురించి ఏమి బయటకు తెలియనప్పటికీ, నవరత్నాలు గురించి అలాగే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య గురించి ఈ ప్రకటనలు ఉండవచ్చని తెలుస్తుంది. ప్రార్థనలు అనంతరం మొదట స్టాలిన్, ఆ తరువాత కేసీఆర్ ఏపీసీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

జగన్ ప్రసంగం మరోసారి ప్రమాణంతో మొదలుపెట్టారు. అనంతరం తన పాదయాత్ర జ్ఞాపకం చేసుకున్నారు. ఆ యాత్రలో ఎదురైన ప్రతివారికి, దానిఫలితంగా ఇచ్చిన అధికారం .. పేరుపేరునా అందహరికి అభివాదాలు తెలిపారు. అనంతరం తన ప్రమాణస్వీకారానికి వచ్చిన పెద్దలకు నమస్సుమాంజలి తెలిపారు.

పేద, మధ్యతరగతి వారికి ప్రమాణస్వీకారంలోనే తమకు భరోసా ప్రకటన చేస్తానని చెప్పినట్టుగానే, నేను చూసాను, విన్నారు, నేను మీ అందరి కోసం ఉన్నాను అన్నారు సీఎం జగన్. మానిఫెస్టోలో చెప్పినట్టుగా నవరత్నాలతో అందరికి న్యాయం చేస్తామని అన్నారు.

మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తానని, ముఖ్యమంత్రి హోదాలో మాట ఇస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా అవ్వ-తాతల కోసం పింఛన్ విషయంలో మాటఇచ్చినట్టుగా 3000 ఇస్తామని, ఆ పథకంపైనే ప్రధమ సంతకం చేస్తున్నారు. వైసీపీ పెన్షన్ పేరుపై 2250 చొప్పున మొదటి సంతకం చేశారు సీఎం జగన్. ఏడాదికి 250 పెంచుకుంటూ పోతామని అన్నారు.

తరువాతి ముఖ్యమైన విషయంగా, కేవలం రెండున్నర నెలలలో అక్షరాలా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నట్టు చెప్పారు. వీరు ప్రభుత్వ పథకాలను ఆయా లబ్దిదారులకు అందిస్తారని చెప్పారు. ప్రతి గ్రామంలో వాలంటీర్ లను నియమించి, వారికీ 5వేల జీతం ఇవ్వబడుతుంది. దీనిద్వారా ప్రభుత్వ పథకాలలో పారదర్శకతను తెచ్చినవారు అవుతారని అన్నారు. అంటే ఆగష్టు 15 కల్లా ఈ నియామకాలు జరిగిపోతాయని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు అందకపైనా, ఎక్కడ వివక్ష కనపడిన, ఎక్కడ లంచం కనిపించినా .. నేరుగా సీఎం కార్యాలయానికి కాల్ చేసేట్టుగా ఏర్పాటు అదే ఆగస్టు 15 కల్లా పూర్తిచేస్తామని చెప్పారు. ఇక గ్రామ సచివాలయాలు కూడా గాంధీ జయంతి కల్లా నియామక పూర్తిచేస్తామని చెప్పారు. ఏది ఎవరికి అందకపోయినా, గ్రామ సచివాయలంలో పిర్యాదు చేయాలనీ, దానికి 72 గంటలలో పరిష్కారం చేస్తామని సీఎం జగన్ చెప్పారు. 

 

Related posts