telugu navyamedia
ఆంధ్ర వార్తలు

2024 ఎన్నికల్లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తా – డీఎల్

సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి డిఎల్‌ 2024 ఎన్నికల్లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తానని ప్ర‌క‌టించారు. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని, ఎందుకు చెప్పలేనంటే ..ప్ర‌జ‌లు కూడా ఏ గాలి ఉదృతంగా వీస్తే ..ఆ గాలి దిశ‌గా పోయే ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని అన్నారు.

రెడ్ల రాజ్యం రావాలని కోరుకుని ఓట్లేసిన అందరికి తగిన బుద్ధి జరిగిందంటూ కాజీపేటలో ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న డియల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిభ ఆధారంగానే పార్టీ టికెట్ వస్తుందని, రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారి పోయారని ఆరోపణలు చేశారు డీఎల్‌.. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని, రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారని, గిట్టుబాటు ధరలు లేక పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతు కరువయ్యాడన్నారని ,సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొందని..ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దు అని సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోండి అని ప్ర‌జ‌ల‌కు డీఎల్ సూచించారు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారని విమర్శించారు. సబ్సిడీని డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టం ద్వారా అందించడం ఉత్తమని అభిప్రాయ‌ప‌డ్డారు.

దోంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డి కి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి అని ఎద్దేవా డీఎల్ ఎద్దేవ చేశారు.రాష్ట్రంలో ఏ శాఖా మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్‌ మీట్‌ పెట్టడం లేదన్నారు.దారినపోయే వారందరూ ప్రెస్‌ మీట్‌లు పెడుతున్నారన్నారు.సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలన్నారు. ప్రశ్నించుకుంటే సమాజం అధోగతి పాలవుతుందన్నారు.

ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దు అని సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోండి అని ప్ర‌జ‌ల‌కు డీఎల్ సూచించారు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారని విమర్శించారు. సబ్సిడీని డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టం ద్వారా అందించడం ఉత్తమని అభిప్రాయ‌ప‌డ్డారు.

Related posts