telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్‌16, శ‌నివారం రాశి ఫ‌లాలు

మేషం..
పాతమిత్రులను కలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం.చ‌ర్చ‌లు, స‌ద‌స్సులు మిమ్మ‌ల్ని ఆక‌ర్షిస్తాయి. మ‌నోధైర్యాన్ని క‌లిగియుంటారు.

వృషభం..
అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు వింటారు.

మిథునం..
కుటుంబంలో చికాకులు క‌లుగుతాయి, బంధు, మిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది.ధనవ్యయం, దూరప్రయాణాలు, బంధువుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యభంగం.

కర్కాటకం..
రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తి విషయాలలో వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో చికాకులు. విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది.నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

సింహం..
నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ప‌డుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. దైవదర్శనాలు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరును. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది.

కన్య..
నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు. దైవదర్శనాలు చెస్తారు. కుటుంబ విష‌యాలందు అనాస‌క్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం.

తుల..
ఆకస్మిక ప్రయాణాలు. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చుఅగుట‌చే ఆందోళ‌న చెందుదురు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఎక్కువ‌గా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. విదేశయాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది.

వృశ్చికం
ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.బంధు, మిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు.

ధనుస్సు
పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చు చేస్తారు.

మకరం
వ్యయప్రయాసలు. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. అనుకోని ప్రయాణాలు. పనులు నిదానంగా సాగుతాయి.అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

కుంభం
ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం ఉంటాయి.కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

మీనం
ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు.మానసిక అశాంతి. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

Related posts