విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. హత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్టి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పక్కకు లాగిన పోలీసులు.. అతి కష్టం మీద వాసిరెడ్డి పద్మను ఆసుపత్రి లోపలకి పంపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారని సమాచారం తెలిసిన తర్వాతే అధికార పార్టీ లీడర్లు మేల్కొన్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇప్పటి వరకు నిందితులకు అండగా నిలిచిన అధికార పార్టీ లీడర్లు ఇప్పుడు బాధితురాలని పరామర్శించడం ఏంటని ప్రశ్నిస్తోంది టీడీపీ శ్రేణులు.
కరోనా వచ్చిందని నిన్నంత డ్రామాలు ఆడిన వాసి రెడ్డి పద్మ ఇప్పుడు ఎలా ఆసుపత్రికి వచ్చారని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఒక్కరోజులోనే కరోనా తగ్గిపోయిందా అంటూ నిలదీస్తోంది. చంద్రబాబు వస్తున్నారనే భయంతోనే బాధితురాలిని పరామర్శించారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు.