telugu navyamedia
రాజకీయ వార్తలు

ఝార్ఖండ్ లో బీజేపీ వెనుకంజ..గెలుపు దిశగా జేఎంఎం కూటమి!

evm issues even in 4th schedule polling

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని భావించినప్పటికీ కాంగ్రెస్ – జేఎంఎం కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. ప్రజలు మాత్రం స్పష్టమైన అధికారం వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది.జేఎంఎం కూటమి ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.

ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా.. ప్రస్తుతం జేఎంఎం – కాంగ్రెస్ కూటమి 43 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. బీజేపీ 28, ఏజేఎస్ యూ 4, జేవీఎం 3, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ 42, జేఎంఎం 19, జేవీఎం 8, కాంగ్రెస్ 6, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు.

ఇటీవలి పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, అంతకుముందు తెరపైకి వచ్చిన జాతీయ పౌరగణన అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఓబీసీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫర్వాలేదనిపించిన బీజేపీ, ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ వెనుకంజలో ఉంది.

Related posts