telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

సిగరెట్ ప్యాకెట్ పై బొమ్మను చూసిన అతడికి షాక్… ఏమైందంటే… ?

Cigarette

సాధారణంగా చాలామందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. అయితే సిగరెట్ తాగే వారికి బాగా తెలుసు… సిగరెట్ ప్యాకెట్ పై ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. కేన్సర్ కారకం’ అంటూ సిగరెట్ ప్యాకెట్లతో పాటు పొగాకు ఉత్పత్తులు అన్నింటిపై హెచ్చరికతో కూడిన ఒక లైన్ తో పాటు పొగాకు ఉత్పత్తులను వాడడం వల్ల మన శరీరంలోని భాగాలు దెబ్బతింటాయని సూచిస్తూ కొన్ని బొమ్మలను కూడా ప్యాకెట్లపై ఆయా కంపెనీలు ముద్రిస్తాయి. ఆ ప్యాకెట్ పై ఏకంగా మన ఫోటోనే కన్పిస్తే ఎలా ఉంటుంది? ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని మెట్జ్‌లో నివాసముంటున్న అతడు ఇటీవల తన కొడుకు తీసుకొచ్చిన ఓ సిగరెట్ ప్యాకెట్‌పై హెచ్చరిక రూపంలో ఉన్న బొమ్మ చూసి షాక్ అయ్యాడు. సిగరెట్ ప్యాకెట్‌పై ఓ కంపెనీ ముద్రించిన ఒంటికాలి బొమ్మ… ఆ బొమ్మ అతడిదే. తన ఒంటికాలి ఫొటోను సదరు కంపెనీ వేరే విధంగా చూపించిందని అతడు వాపోతున్నాడు. అల్బేనియాకు చెందిన ఆ వ్యక్తి ఫ్రాన్స్‌కు వలస వచ్చేముందు 1997లో జరిగిన దాడిలో తన కాలు పోగొట్టుకున్నట్లు చెప్పాడు. ఆ సయమంలో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు తీసిందే ఆ ఫొటో అని పేర్కొన్నాడు. సదరు సిగరెట్ సంస్థ ప్రతినిథులు ఆ ఆసుపత్రి నుంచి తన ఫొటో తీసుకొని ఉంటారని తెలిపాడు. ఇక అనుమతి లేకుండా తన ఫొటో ఎలా వాడుకుంటారని సిగరెట్ కంపెనీ యాజమాన్యంపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పాడు.

Related posts