ఆకలి కేకలు ధనికులెరుగునా
ఆపదలు అహాకారాలు
వారికి వినిపించునా
విధి వంచనకు గురైన
పేద వాడి భాద వారికి పట్టునా
కారడవిలో కటిక చీకటిలో
కాలం వెల్లబుచ్చే నిరుపేదలకు
దారి చూపే నాయకుడే రాకపాయే
అన్నదాత ఆక్రందనలు
అసెంబ్లికే పరిమితమాయే
ఉసూరుమంటు ఊసుపోక
వృద్దులు పెన్షన్లకోసం
పడిగాపులు కాయసాగే
కాన రాని దేవుడు
కష్టాల పాలు చేసే
……………………………
ఏమి ఆశించని ప్రేమకు మరణం లేదు
స్వార్థంతో నిండిపోయిన ప్రేమకి జీవం ఉండదు
పవిత్రమైన ప్రేమ అజరామరం
అపవిత్రమైన ప్రేమ ఆహుతౌతుంది
అన్నింటికి మించి దైవం శాశ్వతం
అది తెలుసుకుంటే కాదు ఏది అశాశ్వతం