telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

బట్ట తలకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!

మనకు ఇష్టమైన వంటకాల్లో ఉల్లిపాయలను చేర్చుకుంటాం. ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు గురించి మన అందరికీ బాగా తెలుసు. కానీ ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకు కారణం ఉల్లిపాయ యొక్క వాసన. ఉల్లిపాయల యొక్క వాసన నచ్చనందున బ్యూటీ టిప్స్ కి దీన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు.
2002 లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ లో ప్రచురించబడిన ఒక పత్రికలో ‘అలోపీశియా ఏరియేట’ అనే ఒక రకమైన బట్ట తలను పోగొట్టడంలో ఉల్లిపాయ యొక్క సామర్థ్యం రుజువైంది. దీనిపై తదుపరి పరిశోధనలు కూడా ఉన్నాయి, అన్ని పరిశోధనలూ దీని ప్రభావాన్ని గుర్తించాయి.
ఉల్లిపాయ ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్. ఇది స్కాల్ప్ పై ఎలాంటి సంక్రమణం కూడా ఏర్పడకుండా శుభ్రంగా ఉంచడానికి అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. చుండ్రుని కూడా తొలగిస్తుంది. వాటితో పాటు జుట్టు మూలాలను శుభ్రపరచి మాడును ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.
మన శరీరంలో ముఖ్యమైన ఆధార మూలకాల్లో ఒకటి సల్ఫర్. వెంట్రుకలు, గోర్లు మరియు చర్మంలో సల్ఫర్ ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది స్కాల్ప్ పై వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు జుట్టు ఫోలికల్స్ ని ఉత్తేజ పరుస్తుంది.
జుట్టు మూలాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ చేరడం ద్వారా సంభవించే ఆక్సిడేటివ్ ఒత్తిడి తరచుగా జుట్టు సన్నబడటానికి కారణమవుతుంది మరియు సహజమైన యాంటీ ఆక్సిడెంట్లను తగ్గించి అకాలంలో తెల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది. ఉల్లిపాయ రసం స్కాల్ప్ పై కెటలాస్ (ఒక రకమైన ఎంజైమ్) స్థాయిని పెంచుతుంది, ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ సన్నాహాన్ని నియంత్రిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఉల్లిపాయలు హెయిర్ ఫోలికల్స్ కు పోషణను అందించగలుగుతుంది కనుక పురుషులలో జన్యుపరమైన కారణాల వలన ఏర్పడిన బాల్డ్ ప్యాచెస్ ని కూడా ట్రీట్ చేసేందుకు సహాయపడుతుంది.
జుట్టు సమస్యలను నివారించడంలో ఉల్లిపాయల యొక్క ఉపయోగాలను తెలుసున్నారు కదా! మరి ఎలా ఉపయోగించాలి అన్న వివరాలను తెలుసుకుందాం రండి.
ఉల్లిపాయ రసం ని తయారు చేసే విధానం…
మీ కురులకు సరిపడేన్ని ఉల్లిపాయలను తీసుకొని తోలు తీసి శుభ్రమైన నీళ్లతో కడగాలి. ఆ తరువాత ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్ లో వేసి 2 నిమిషాల పాటు రుబ్బాలి. కావల్సినంత నీళ్లను చేర్చుకొని రుబ్బుకోవచ్చు.
రుబ్బిన ఉల్లిపాయలను ఫిల్టర్ లో లేదా శుభ్రమైన కాటన్ వస్త్రంలో గాని వేసి పిండితే ఉల్లిపాయ రసం రెడీ అవుతుంది. లేదా ఉల్లిపాయను గ్రేట్ చేసి వాటిని పిండి కూడా రసం తయారు చేసుకోవచ్చు. జుట్టుపై వాడేటప్పుడు ఎల్లప్పుడూ తాజా ఉల్లిపాయ రసం ని మాత్రమే ఉపయోగించాలి.
ఉల్లిపాయ రసం తయారు చేసుకున్న తరువాత హెయిర్ ఫాల్ మరియు బాల్డ్ ప్యాచెస్ ని తొలగించేందుకు క్రింద చెప్పిన అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ రసంను ఉపయోగించే సులభమైన పద్ధతులు
వట్టి ఉల్లిపాయ రసం…
అవును, వట్టి ఉల్లిపాయ రసాన్ని మీ స్కాల్ప్ పై డైరెక్ట్ గా అప్‌లై చేయవచ్చు. మీ చేతి వేలతో స్కాల్ప్ పై రాసి ఆ తరువాత జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పూర్తిగా రాయండి. బాల్డ్ ప్యాచెస్ మరియు థిన్ హెయిర్ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో గ్యాప్ లేకుండా రాయాలి. బాగా రాసిన తరువాత గంట సేపు ఉంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో కడగాలి.
గమనిక : ఉల్లిపాయ రసం ఉపయోగించిన తర్వాత కెమికల్స్ అధికంగా ఉండే షాంపూ ను ఉపయోగించకండి. మైల్డ్ లేదా హెర్బల్ షాంపూ ను ఉపయోగిస్తే మంచిది.
ఉల్లిపాయ రసం మరియు తేనె…
తేనెలో అనేక ఔషధ గుణాలున్నాయని మన అందరికీ తెలిసిందే. ఇది చర్మం మరియు కేశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటానికి కూడా సహాయపడుతుంది.
ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత స్కాల్ప్ పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.
ఉల్లిపాయ రసం మరియు కలబంద…
జుట్టు పెరుగుదలను ప్రేరేపించేందుకు మరియు జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు కలబంద ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తాజాగా తయారు చేసిన ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని కలిపి స్కాల్ప్ మరియు కురులపై రాయండి. బాగా అప్‌లై చేసినట్టు నిర్ధారించుకోండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.
ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్…
ఆలివ్ ఆయిల్ ని జోడించడం వలన ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాన్ని అధికరిస్తుంది. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెని కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత మాడు పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.
ఉల్లిపాయ రసం మరియు రోస్ మేరీ ఆయిల్…
రోస్ మేరీ ఆయిల్ హెయిర్ ఫాల్ ని నియంత్రించి కురులు ధృఢంగా పెరిగేందుకు సహాయపడుతుంది. మీకు ఉల్లిపాయల వాసన నచ్చకపోతే ఈ రెమిడీ ని ఫాలో అవ్వండి. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో 10-15 చుక్కల రోస్ మేరీ నూనెని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి బాగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి. రోస్ మేరీ ఆయిల్ ఉల్లిపాయల యొక్క వాసనను తగ్గిస్తుంది.
అయితే, వాటి యొక్క ఫలితాలు వ్యక్తిగత శారీరక స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక రెగ్యులర్ గా ఆనియన్ రెమిడీస్ ని ఉపయోగించినప్పటికీ వెంటనే ఫలితాలు కనిపించకపోతే నిరాశ చెందకండి. ఈ రెమిడీలను కనీసం వారానికి 3 సార్లు 2 నెలల పాటు ఉపయోగిస్తే తప్పుకుంటా మీ జుట్టు పెరుగుదలలో మార్పులను చూడవచ్చు.

Related posts