అలసటగా ఉంది
నిద్రపోవాలని ఉంది
భవబంధాలను వదిలి
రాగద్వేషాలును పక్కకు నెట్టి….
నమ్మించి వెన్నుపోటు పొడిచేవారిని
స్నేహం చాటున గొంతు కోసేవారినుండి కదిలిపోవాలనుంది….
నాది నీది అనే వంతులాటనుండి
ఒకరికి ఒకరనే ప్రపంచంలోకి అడుగెట్టాలనుంది….
అలుపెరగక చేసిన పయనానికి
స్వస్తిపలికి మనసు పడే యాతనకి
ముగింపు చెప్పి
కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన
లోకం నుండి
నాదైన మరో లోకంలోకి వెళ్లాలనుంది….
బతుకు చిత్రంలో మసిబారిన
జ్ఞాపకాలెన్నో మరచి
ప్రశాంతంగా అలసట తీరాలని
నే పయనిస్తున్నా..
అలుపెరగని ప్రపంచానికి…