దేశ రాజధాని ఢిల్లీ లో లాక్డౌన్ ప్రకటించడంతో మద్యం కోసం మందుబాబులు ఎగబడుతున్నారు. ఢిల్లీ లో ఎక్కడ చూసిన వైన్ షాప్ ల ముందు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మాస్కులు, భౌతిక దూరం లేకుండానే క్యూ లైన్లలో కొందరు మందుబాబులు ఉన్నారు. మద్యం కొనడానికి మహిళలు కూడా క్యూ కడుతున్నారు. అంతే కాదు.. కేసుల కొద్దీ మద్యం తీసుకొనిపోతున్నారు జనాలు. వైన్ షాప్ లలో ఉన్న పాత స్టాక్ కూడా కొనుక్కుంటున్నారు మందుబాబులు. కాగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని తాజా పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. రోజురోజుకూ భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. కరోనాతో ఇప్పటికే అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినా.. లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి అక్కడ లాక్ డౌన్ అమలు కానుంది.
previous post

