telugu navyamedia
క్రీడలు వార్తలు

అలా చేస్తేనే సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు న్యాయం జరుగుతుంది…

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. డ్యూ ప్రభావం కారణంగా 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బౌలర్లు కాపాడలేకపోయారు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. ‘వాంఖడే వంటి మైదానాల్లో సెకండ్ బౌలింగ్ చేయడం చాలా కష్టం. మా బౌలింగ్ యూనిట్ ఈ పరిస్థితులను ముందే ఊహించి దానికి అనుగుణంగా సిద్దమయ్యాం. కానీ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీని అడ్డుకోలేకపోయాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో రెగ్యూలర్‌గా బంతిని మార్చితే ఈ డిస్ అడ్వాంటేజ్‌ను అధిగమించవచ్చనేది నా అభిప్రాయం. అలా చేస్తేనే సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు న్యాయం జరుగుతుంది. నేనేదో ఓడిపోయాననే బాధలో ఈ మాట చెప్పడం లేదు. ఫలితాన్ని డ్యూ ప్రభావం శాసించకుండా చేసేందుకే బంతిని మార్చాలని, సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు ఉన్న డిస్ అడ్వాంటేజ్‌ను తొలగించాలని చెబుతున్నా. బౌలర్లు తడి బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినప్పటికీ ఫీల్డ్‌లో తీవ్ర ఒత్తిడి మధ్య రాణించడం చాలా కష్టం అవుతోంది. చాలా సార్లు బంతిని మార్చాలని అంపైర్‌ను అడిగాను. కానీ నిబంధనల్లో బంతిని మార్చే వెసులు బాటు లేదన్నారు. సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు కష్టమవుతున్న నేపథ్యంలో బంతిని మార్చుకునే వెసులుబాటు కల్పించాలి.’అని రాహుల్ సూచించాడు.

Related posts