telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పుష్ప’ లో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నివేదా థామస్

niveda

సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక కనిపించనుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అడవి నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా, అడవికి చుట్టూ అల్లుకున్న అవినీతి వెనకున్న పెద్ద తలకాయల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈసినిమాలో మరో కథానాయికగా నివేదా థామస్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఆమె పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఈ సినిమాలో సిన్సియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా, చాలా కీలకమైనదని అంటున్నారు. ఆమె పాత్ర కారణంగానే హీరో అడవిలోకి అడుగుపెడతాడని చెబుతున్నారు.

Related posts