telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2 నెలల తరువాత జోర్డాన్ నుంచి కొచ్చికి చేరిన 58 మంది చిత్రబృందం

Prithviraj

లాక్ డౌన్ కారణంగా ఎక్క‌డి వారు అక్క‌డే చిక్కుకుపోయారు. మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ తో పాటు 58 మంది చిత్ర బృందం లాక్‌డౌన్ కార‌ణంగా జోర్డాన్‌లో చిక్కుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదుజీవితం చిత్రీకరణ కొద్ది రోజులుగా జోర్డాన్‌లో జ‌రుగుతుంది. బ్లెస్సీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కోవిడ్ 19 వ‌ల‌న మార్చి 27 నుండి చిత్రీక‌ర‌ణ ఆగిపోయింది. దీంతో మూవీ బృందం ఇండియాకి వ‌చ్చేందుకు ఎంతగానో ప్ర‌యత్నించింది. వీలు కాక‌పోవ‌డంతో బ్లెస్సీ, పృథ్వీరాజ్ కేర‌ళ సీఎంకి కూడా లేఖ రాసారు. ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. అన్న‌పానీయాలు సైతం అందుబాటులో ఉండ‌ట్లేద‌ని, కేర‌ళ‌కు తిరిగి వ‌ద్దామ‌న్నా విమానాల రాక‌పోక‌లు స్థంభించిపోయాయ‌ని పేర్కొన్నాడు. ప్ర‌భుత్వ సాయం లేనిదే కేర‌ళ‌కు రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని వాపోయాడు. మా స‌మస్య‌కు ప్ర‌భుత్వ‌మే ప‌రిష్కారం చూపాల‌ని లేఖ‌లో అభ్య‌ర్థించాడు. మ‌రోవైపు పృథ్వీరాజ్ కూడా ఇదే విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌స్తావించాడు తాజాగా వీరు స్పెష‌ల్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా జోర్డాన్ నుండి కొచ్చి చేరుకున్నారు. దీంతో అభిమానులు, కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్య‌క్తం చేశారు.

Related posts