telugu navyamedia
రాజకీయ

కమలా హారిస్‌ విజయం ప్రపంచానికే స్ఫూర్తి..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో వైట్‌హౌస్‌ ప్రాంగణంలో భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక… ప్రధాని మోదీతో ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.

Image

మొదట అమెరికాలోని టాప్‌ గ్లోబల్‌ కంపెనీల సీఈఓలతో సమావేశమైన నరేంద్ర మోడీ ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక కావడం చరిత్రాత్మకమని పేర్కొంటూ మోదీ ఆమెకు అభినందనలు తెలియజేశారు.

Image

భారత ప్రజలు మీకు స్వాగతం పలకడానికి వేచి చూస్తున్నారు” అని , భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు. కమలా హారిస్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆమె విజయం ప్రపంచానికే స్ఫూర్తినిచ్చింది. భారత్, అమెరికాల స్నేహబంధం మరింత బలోపేతం అయ్యేలా మేం ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Image

భారత్, అమెరికాలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని ప్రధాని మోదీ అన్నారు. విలువలు, ప్రాదేశిక రాజకీయ ఆసక్తులు ఒకటేన్నారు. సప్లయ్‌ చైన్స్, నూతన సాంకేతికతలు, అంతరిక్ష రంగాలపై ఇరువురు చర్చించారు. కరోనా సెకండ్‌వేవ్‌ సంక్షోభ సమయంలో భారత్‌కు అమెరికా చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

భారత ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

భారత్‌ తమకు అత్యంత కీలక భాగస్వామ్య దేశమని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌ అన్నారు. ప్రపంచం ప్రస్తుత పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో అమెరికా– భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావాలని కమల ఆకాంక్షించారు. కోవిడ్‌ మహమ్మారిపై సమష్టిగా పోరాడుదామన్నారు. రోజుకు కోటి డోసులు ఇస్తున్నారని భారత్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మెచ్చుకున్నారు. 

Covid vaccines likely focus at Quad Summit when Modi meets Biden today

కాగా..మోదీ ఈ రోజు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తొలిసారిగా సమావేశం కానున్నారు. దాంతో.. మూడు రోజుల పాటు కొనసాగిన భారత ప్రధాని అమెరికా పర్యటన ముగియనుంది.

Related posts