ప్రేమకథా చిత్రమ్ మూవీ హరర్ అండ్ లవ్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొంది ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ‘ప్రేమ కథా చిత్రం 2’ సినిమాని రూపొందుతుంది. ఈ చిత్రానికి ‘బ్యాక్ టూ ఫియర్’ అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమ కథా చిత్రం2 రూపొందుతుంది.
ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో తాజాగా విడుదలైంది. ఫస్ట్ టైమ్ హార్ట్ బీట్ ప్రమోషనల్ సాంగ్ అంటూ విడుదలైన సాంగ్‌లో మేకింగ్ విజువల్స్ చూపించారు. ఈ వీడియో అభిమానులని ఆకట్టుకుంటుంది. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమాకి పని చేస్తున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.