telugu navyamedia
క్రీడలు వార్తలు

ప్రసిధ్ కృష్ణ రాణించడంతో ముఖ్య పాత్ర ఎవరిదంటే…?

ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేసర్ ప్రసిధ్ కృష్ణ వన్డే ఫార్మటు లో తన అంతర్జాతీయ అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబర్చారు. 18 టీ20ల అనుభవం ఉన్న కృనాల్ ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకోగా.. సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌గా ఈ సిరీస్‌కు ఎంపికైన ప్రసిధ్ కృష్ణ తన పవర్‌ఫుల్ బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్ర వన్డేలో అత్యధిక వికెట్లు తీసి.. ఈ ఘనతను అందుకున్న భారత బౌలర్‌గా రికార్డు సృష్టించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. అయితే తన ఫస్ట్ స్పెల్‌లో మూడు ఓవర్లలో అతను ఏకంగా 37 పరుగులు ఇచ్చుకున్నాడు ప్రసిధ్. కానీ అసాధారణంగా పుంజుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బిల్లింగ్స్, మొయిన్ అలీలను ఔట్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్‌లీని ఆరాధించే ప్రసిధ్ కంగారూల గడ్డపైనే తన పేస్‌కు పదును పెట్టుకున్నాడు. ఎంతో మంది బౌలర్లను తీర్చిదిద్దిన ఆసీస్ లెజెండరీ పేసర్ జెఫ్ థామ్సన్ శిష్యరికంలో రాటు దేలాడు. థామ్సన్ చెప్పిన టిప్స్‌తో తెలివైన బౌలర్‌గా మారాడు. ప్రారంభంలో రన్స్ లీక్ చేసినా.. కంగారుపడకుండా ఎలా పుంజుకోవాలో నేర్చుకున్నాడు. అలాగే ఎంఆర్‌ఎఫ్ అకాడమీలో మరో ఆసీస్ గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ సమక్షంలో శిక్షణ తీసుకోవడం కూడా ప్రసిధ్‌కు చాలా హెల్ప్ అయింది.

Related posts