యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా వరకు మీడియాకు దూరంగానే ఉంటారు. తన సినిమాల విడుదల సమయంలోనే మీడియా కంట పడతారు. టీవీ కార్యక్రమాలకు, ఇంటర్వ్యూలలో అస్సలు కన్పించడు ప్రభాస్. అయితే ఇప్పుడు త్వరలోనే ప్రభాస్ బుల్లితెరపై దర్శనం ఇవ్వబోతున్నాడట. ప్రముఖ యాంకర్ ప్రదీప్ జీ తెలుగులో నిర్వహించబోతున్న “కొంచెం టచ్లో ఉంటే చెబుతా” కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కాబోతున్నాడట. ఈ కార్యక్రమం తర్వాత సిరీస్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రభాస్ తోనే ఆ కార్యక్రమం ప్రారంభమవబోతోందట. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రభాస్ అంగీకరించాడట. దానికి కారణం “సాహో” సినిమా. “సాహో” సినిమా హక్కులను జీ గ్రూప్ దాదాపు 50 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఛానెల్ నిర్వహించే కార్యక్రమానికి రావడానికి ప్రభాస్ అంగీకరించినట్టు సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో” టీజర్ కొద్ది నిమిషాల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్లో ప్రభాస్ చేస్తున్న స్టంట్స్, యాక్షన్ సీన్స్ సామాన్య జనాలనే కాక సెలబ్రిటీలని కూడా ఆకట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్ జరుగుతుండగా, ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
previous post
బాలయ్య మొనగాడు… చిరంజీవి గిరంజీవి ఎవరూ… : బాబు మోహన్